70 Gates Lifted Due To Heavy Inflow in Prakasam Barrage.
#PrakasamBarrage
#Vijayawada
#Andhrapradesh
#YSRCP
#YSJagan
#Floods
#pulichintala
#vellampallisrinivas

పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజి 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం 70 గేట్లను మూడు అడుగుల మేర పైకి ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలుతున్నారు. తెల్లవారుజాము సమయానికి మరో రెండు అడుగుల మేర పైకి ఎత్తి మరో రెండు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి పంపించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. గంట గంటకు వరద నీరు ఉధృతంగా ప్రకాశం బ్యారేజికి చేరుతోంది. నందిగామ, మైలవరం శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు, వసంత కృష్ణప్రసాద్ నదీ తీరంలో పర్యటిస్తూ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింప చేస్తున్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ ఎప్పటికప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో చందర్లపాడు పరిసరాల్లో వరద నీటిలో చిక్కుకున్న నలుగురు మత్సకారులు, 400 గొర్రెలను సురక్షితంగా తరలించారు.